NATIONAL

చట్టవిరుద్ధ లోన్ యాప్​ల లావాదేవీలపై CBI,EDలు దృష్టి సారించాలి-కేంద్ర ఆర్థిక శాఖ

అమరావతి: అప్పు అడిగిన వెంటనే ఎలాంటి షరతులు లేకుండా,,డాక్యూమేంటేషన్ ఆసలే అవసరం లేదంటూ,, సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధిస్తున్న లోన్​ యాప్​ లను కట్టిడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టుంది..లోన్​ యాప్​ల ఆగడాలు అంతకంతకూ ఎక్కువై, అనేక మంది రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్రమ లోన్​ యాప్స్​ అసలు ప్లే స్టోర్స్​లో కనిపించకుండా చేయాలని,, ఇందుకోసం చట్టబద్ధమైన లోన్​ యాప్​ల వివరాలతో వైట్​ లిస్ట్ తయారు చేయాలని రిజర్వు బ్యాంకును ఆర్థిక శాఖ ఆదేశించింది..శుక్రవారం దిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం లోన్​ యాప్​ల పనితీరు, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో విస్తృతంగా చర్చించారు..రిజర్వు బ్యాంకు తయారు చేసిన వైట్​ లిస్ట్​లోని లోన్​ యాప్​లు మాత్రమే ఆండ్రాయిడ్, యాపిల్ యాప్​ స్టోర్స్​లో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్మల నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు..అక్రమ లోన్​ యాప్​ల ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు..చట్టవిరుద్ధ రుణ యాప్​ల లావాదేవీలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్, కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ దృష్టి సారించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *