హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కల్వకుంట్ల కవితను ఆదివారం CBI-DIG రాఘవేంద్ర ఆధ్వర్యంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని సమాచారం. 10.30 గంటలకు చేరుకుని అధికారులు 7.30 గంటల పాటు 5 అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేశారు.ఈ కేసులో కవితకు CBI అధికారులు ఇప్పటికే 160 CRPC కింద నోటీసులు ఇచ్చారు. తమ అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను ఎమ్మెల్సీ కవిత ఇచ్చారని తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ ప్రత్యేక టీమ్..ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. సీబీఐ మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారని తెలుస్తోంది. 170 మొబైల్ ఫోన్లను ధ్వసం చేయడంతో పాటు,, నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు,,అరుణ్ రామచంద్ర పిళ్లై,, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.