అమరావతి: మద్యం స్వామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి,,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆర్దిక) కీలక నేత మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో A1గా,,120-B, 477-A సెక్షన్ల ప్రకారం ఆయన పేరును నమోదు చేశారు..సిసోడియాతో సహా,,నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణతో కలుపుకుని మొత్తం 15 మంది పేర్లు వున్నాయి.. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు,, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు..గత సంవత్సరం నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి..ఈ టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది..దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు..ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్ గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో పొందుపర్చారు..
Delhi Dy CM Manish Sisodia among 15 persons booked by name in FIR filed by CBI. Excise officials, liquor company executives, dealers along with unknown public servants & private persons have too been booked in the case (addresses omitted, previous tweet had personal information) pic.twitter.com/44L12CmHNn
— ANI (@ANI) August 19, 2022