14 రంగాలకు ప్రోత్సాహం-క్రీయాశీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం కేబినెట్

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది..కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు..సౌరశక్తి ప్లాంట్ల కోసం కేంద్రం 19,500 కోట్లు మంజూరు చేసింది..అలాగే 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు PLI స్కీమ్ తీసుకొచ్చింది..అలాగే PLI స్కీమ్ క్రింద సోలార్ ప్యానెళ్లను చేర్చారు.. సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది..ఈ నెల 17వ తేదిన ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేంద్రం ఆమోదించింది.. 2030 నాటికి టాప్ 25 దేశాల సరసన చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టనున్నారు..వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ లపై ప్రధానంగా ఈ పాలసీ దృష్టి సారిస్తుంది..దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు.
Cabinet approved National Logistics Policy. It'll introduce ULIP, standardization, monitoring framework & skill development for greater efficiency in logistics services. Target is to improve Logistics Performance Index ranking,be among top 25 countries by 2030: Union Min A Thakur pic.twitter.com/g7QSZn1zxK
— ANI (@ANI) September 21, 2022