AMARAVATHIPOLITICS

నెల్లూరుజిల్లాలో ఎమ్మేల్యేల మధ్య సవాళ్లు,,ప్రతి సవాళ్లతో రాజకీయ సంత?

నెల్లూరు: నెల్లూరుజిల్లా రాజకీయల్లో నగర ఎమ్మేల్యే అనిల్ కు,,వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మేల్యేల మధ్య  సవాళ్లు,,ప్రతి సవాళ్లతో రాజకీయ సంత జరుగుతొంది..వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి,,ఆనం.రాంనారాయణరెడ్డి,, కోటంరెడ్డి‌ శ్రీధర్ రెడ్డిలపై,,వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వెటకారపు ఛాలెంజ్ పై అదే స్థాయిలో తిరిగి సమాధానం వస్తొంది..

పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతిపక్షపార్టీలో సర్ధుబాట్లు చేసుకుని,,రాబోయే ఎన్నికల్లో జిల్లాలో మొత్తం సీట్లు ప్రతిపక్షపార్టీ గెలుచుకుంటుంది అని జోస్యం చెప్పడంపై ఎమ్మేల్యే అనిల్ ఎద్దేవా చేస్తూ,,ముందుకు మీరు గెలవండి చూద్దాం…ఒక వేళ మీరు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే,,నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ విసిరారు..ఇందుకు మంగళవారం ఉదయగిరి ఎమ్మేల్యే మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తు వచ్చే ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తాం….నువ్వు ఓడిపోవటం ఖాయం అన్నారు…ఒక వేళ నువ్వు గెలిచి అసెంబ్లీకి వస్తే,,తాము రాజకీయలు వదిస్తేందుకు సిద్దం అంటూ అదే స్థాయిలో జవాబు ఇచ్చారు..మాజీ మంత్రి అనిల్… నోరు వుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు…సింగిల్ డిజిట్‌తో గెలిచిన నువ్వు ఎక్కడ.. 35వేల మెజార్టీతో గెలిచిన నేనెక్కడ..అంటూ అనిల్‌ను ఎద్దేవా చేశారు..

ప్రస్తుతం అనిల్ ఏదో భ్రమలో మాట్లాడుతున్నాడని, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని, వైసీపీ ఓడిపోబోతుందని మేకపాటి జోస్యం చెప్పారు…మమ్మల్ని సస్పెండ్ చేశారు,, నీకు పార్టీ టికెట్టు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది…ముందు నీ సంగతి చూసుకో అనిల్ అంటూ మేకపాటి హితవు పలికారు…

రాష్ట్రంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ‌పైన అసంతృప్తితో ఉన్నారంటూ బాంబు పేల్పేరు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి నాకు ఐదు కోట్లు ఇచ్చారనే ఆరోపణలు నిజం కాదని, మేకపాటి కుటుంబం మీకోసం పదవులు రాజీనామా చేసి, మీకు ఆర్థికంగా ఉపయోగపడ్డ వ్యక్తులం అని గుర్తుంచుకోవాలని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *