12,13తేదీలలో భారీ వర్షాలకు ఆవకాశం

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం ఈశాన్య శ్రీలంక వద్ద ఉన్నతమిళనాడు తీరం మీద అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని అమరావతి వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఇది నవంబర్ 12 ఉదయం నాటికి వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు.12,,13,తేదీల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తమిళనాడు-పుదుచ్చేరి,కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం. శనివారం-తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
రాయలసీమ:-గురు- తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు…శుక్ర,,శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.