నెల్లూరుజిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం-వాతావరణశాఖ

అమరావతి: మంగళవారం ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ & పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ఘడ్,,ఆంధ్రప్రదేశ్ సముద్రతీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ నుంచి 3.1 కి.మీ మధ్య వ్యాపించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు..ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని పేర్కొన్నారు..వీటి ఫలితంగా నెల్లూరు జిల్లాలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు..బుధ,,గురువారల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు,,అలాగే ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు..