AMARAVATHI

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు..అలాగే మన్యం,అల్లూరి, పశ్చిమ గోదావరి,కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 5PM నాటికి ప్రకాశం(D) ఒంగోలులో 50.5మిమీ, నెల్లూరు(D)ఓలేటివారిపాలెం 48.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *