నెల్లూరు: ఈనెల 28 29 30 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టిడిపి ముఖ్య నేతలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ జెడ్ శివ ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుటూరు మురళి కన్నబాబు, టిడిపి సీనియర్ నాయకులు వెమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాజీ జెడ్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విజేత రెడ్డి లు సమావేశమయ్యారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసే దిశగా వారు పలు అంశాల గురించి చర్చించుకున్నారు.