అమరావతి: జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKKA)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జీషీట్ దాఖలు చేసింది..ఫరూఖ్ అబ్దుల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, దాదాపు రూ.43.69 కోట్ల నిధులను ఇష్టానుసారంగా ఎవరు పడితే వారి ఖాతాలకు మళ్లించారని చార్జిషీట్ లో పేర్కొంది..ఈ వ్యవహారంపై మే 31వ తేదినే ఫరూఖ్ అబ్దుల్లాను ED దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించింది..
విచారణకు హాజరుకావాలి కోర్టు ఆదేశం:- ED చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో శ్రీనగర్ లోని మనీలాండరింగ్ వ్యవహారాల (PMLA) కోర్టు మంగళవారం ఫరూఖ్ అబ్దుల్లాకు నోటీసులు జారీ చేసింది..ఆగస్టు 27వ తేదిన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అదేశించింది..ఈ అభియోగాలపై 2020 సంవత్సరంలో ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన దాదాపు రూ.11.86 కోట్ల విలువైన ఆస్తులనూ ED అటాచ్ చేసింది..2018 జులై 11వ తేదిన ఈ కేసుకు సంబంధించి CBI దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ED దర్యాప్తును ప్రారంభించింది…మొత్తం రూ.51.90 కోట్ల అవకతవకలు జరిగాయని దర్యాప్తులో గుర్తించిన ED, ఇప్పటివరకు రూ.21.55 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది…