AMARAVATHIINTERNATIONALTECHNOLOGY

చాట్‌బాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ

అమరావతి: మైక్రోసాఫ్ట్ వినియోగంలోకి తీసుకుని వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెల్ జెన్సీ Chat GPTని బ్యాన్ చేస్తున్నట్టు ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది..ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి యూరోపియన్ దేశంగా ఇటలీ వార్తల్లో నిలించింది..వ్యక్తుల గోప్యతా ఉల్లంఘనలపై విచారణకు ఆదేశించింది..ఈ సందర్భంగా US స్టార్ట్-అప్ OpenAI చేత అభివృద్ధి చేయబడిన మైక్రోసాఫ్ట్ సపోర్టెడ్ చాట్‌బాట్‌,,జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.. Chat GPTని వినియోగదారుల సంభాషణలు, ఇతర చెల్లింపులపై సమాచారాన్ని ప్రభావితం చేసే డేటా ఉల్లంఘన చేసిందంటూ ఇటాలియన్ వాచ్‌డాగ్ మార్చి 20వ తేదిన నివేదిక వెలువర్చింది.. 2022 నవంబరులో చైనా,, రష్యా,,ఇరాన్,, ఉత్తర కొరియా వంటి దేశాలు Chat GPTని బ్లాక్ చేశాయి..ప్రస్తుతం ఇటలీదేశం కూడా అదే జాబితాలోకి చేరింది..ఇటాలియన్ వినియోగదారుల డేటాను సేకరించకుండా తక్షణమే బ్లాక్ చేస్తామని ప్రకటించింది.. Chat GPTని 2021 సంవత్సరం వరకు ఇంటర్‌నేట్‌లో వాడిన డెటా బేస్ అధారంగా ఇది అన్నిరకాల ప్రశ్నలకు సమాధానం ఇస్తొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *