రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా రూ.1.35 కోట్లు ఇచ్చింది-అమిత్ షా

అమరావతి: చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు.మంగళవారం FCRA రద్దు గురించి లోక్ సభలో ప్రస్తావన రావడంతో అమిత్ షా మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005– 2006, 2006 –2007 మధ్య కాలంలో చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు రూ.1.35 కోట్లు అందాయని,,ఇది FCRA నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అందుకే దాని రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంశాఖ రద్దు చేసిందన్నారు. చైనా మీద నెహ్రూకు ఉన్న ప్రేమ కారణంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చిందని,దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నయని అమిత్ షా వ్యాఖ్యానించారు. చైనా సరిహద్దు వివాదం పై వ్యాఖ్యనిస్తూ కాంగ్రెస్ పాలన సమయంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారతదేశం వైపు కాని దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని అన్నారు.