తైవాన్ చుట్టు భారీ ఎత్తున సైనిక విన్యాసాలను ప్రారంభించిన చైనా

అమరావతి: తైవాన్ ను అష్టదిగ్బంధం చేస్తూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది.. వైమానిక దళం, నౌకాదళంతో సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి..టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు..ఆదివారం వరకు విన్యాసాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది..చైనా కవ్వింపు చర్యలతో ఆప్రమత్తమై తైవాన్ తమ దేశ సైన్యాన్ని సిద్దం చేస్తుంది..అలాగే ఒక వేళ దాడులు జరిగితే,,ప్రజలు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది..అమెరికా నావికాదళం తైవాన్ కు సమీపంలో పలు భారీ యుద్ద నౌకలను మోహరించింది..తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది..యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తరువాత చైనా చర్యలు మరింత ముమ్మరం చేసింది..ఇదే సమయంలో వివిధ కారణాలతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది..