దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్ వాహనాన్ని ప్రారంభించిన సీ.ఎం పినరై విజయ్

అమరావతిం దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులు యాంటీ డ్రోన్ వాహనాన్ని వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈగల్ ఐ(Eagle Eye) గా పిలుస్తున్న ఈ వాహనాన్ని కేరళ డ్రోన్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ అభివృద్ధి చేసింది.ఇంటర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్పరెన్స్ (Cocon-22) సందర్బంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ ప్రారంభించారు. యాంటీ డ్రోన్ వెహికిల్ ఖర్చు దాదాపు 80 లక్షలు.తిరువనంతపురంలోని స్టార్ట్ప్ కంపెనీ అయిన ఆల్ డ్రోన్ ప్రైలిమిటెడ్ టెక్నాలజీ సహకారం అందించింది. కంపెనీ సీఈఓ అని శ్యామ్ వర్గస్ మాట్లాడుతూ అత్యధునికమైన టెక్నాలజీని ఈ వాహనంలో అమర్చడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా ఎగిరే కొన్ని డ్రోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ సాయంతో పనిచేస్తాయని,అలాంటి వాటికి అందుతున్న రేడియో ఫ్రీక్వెన్సీ జామ్ చేసినట్లయితే అవి కూలిపోతాయన్నారు.అలాగే విమానాశ్రయాలు, ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వెహికిల్‌ను పోలీసులకు అందుబాటులో ఉంచడం జరిగుతుందని,ఈ వాహనంలోని సాంకేతిక వ్యవస్థ 5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాకుండా నిర్విర్యం చేస్తుందన్నారు.అలాగే ఇందులో GPS ఆధారంగా రిమోట్ కంట్రోల్ తో వుపయోగించే వ్యవస్థలను జామ్ చేయడం జరుగుతుందన్నారు.