యు.పీలో ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసిన సీ.ఎం యోగీ

అమరావతి: ఉత్తరప్రదేశ్ యోగీ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (PWD) బదిలీలలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణల వెల్లువెత్తడడంతో చీఫ్ ఇంజనీర్, పీడబ్ల్యూడీ హెడ్ మనోజ్ కుమార్ గుప్తా, చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) రాకేష్ కుమార్ సక్సేనా, సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ యాదవ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంకజ్ దీక్షిత్, ప్రిన్సిపల్ అసిస్టెంట్ సంజయ్ కుమార్ చౌరాసియాను ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సస్పెండ్ చేశారు..జులై 18వ తేదీన పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేపై చర్య తీసుకున్న తర్వాత ఈ ఐదుగురు అధికారులపై సస్పెండ్ వేటు పడింది..జులై 16వ తేదిన సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా ఐదుగురు ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని సంబంధిత వర్గాల అధికారులు పేర్కొన్నారు..