సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు: సంగం బ్యారేజీని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు,సంయుక్త కలెక్టర్ తో కలిసి సోమవారం సందర్శించారు.అక్కడ జరుగుతున్న పెండింగ్ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని TGP SE హరినారాయణరెడ్డికి సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు ఈనెల 27వ తేదీన జిల్లాకు వచ్చి సంగం బ్యారేజీ పనులను పరిశీలిస్తారన్నారు. అప్పటిలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.