DISTRICTSSPORTS

మాస్టర్స్ అథ్లెటిక్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన కలెక్టర్

నెల్లూరు: సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలపై నుంచి దృష్టి మళ్లించి యువత క్రీడల వైపు మక్కువ చూపే రోజులు తిరిగి రావాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకాంక్షించారు.శుక్రవారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే మాస్టర్స్ అథ్లెటిక్ (30 సంవత్సరాలు పైబడిన వారికి పరుగు పందెం) రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. తొలుత క్రీడామైదానికి విచ్చేసిన కలెక్టర్ కు క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ కు క్రీడాకారులు క్రీడాభివందనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లి ఒడి నుంచే ప్రతిఒక్కరూ క్రీడలను నేర్చుకుంటారని, క్రీడలకు వయసుతో సంబంధం లేదని, అన్ని వయసుల వారు క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 90 ఏళ్లకు పైబడిన వృద్ధులు కూడా వయస్సుతో సంబంధం లేకుండా ఈ పోటీల్లో పాల్గొనడం, క్రీడల ఔన్నత్యానికి నిదర్శనం అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ క్షేమంగా తిరిగి వెళ్లాలన్నారు. వీరిని స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ క్రీడల వైపు ఆసక్తి చూపాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు నెల్లూరు వేదిక కావడం మన గర్వకారణం అన్నారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి పరుగు పందెం పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ క్రీడాకారులను కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో NCC 24వ ఆంధ్ర బెటాలియన్ CEO పీకే పాండే, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ రాజశిఖామని, ప్రెసిడెంట్ లక్ష్మీపతి రాజు, స్టేట్ సెక్రటరీ రాంప్రసాద్, జిల్లా సెక్రెటరీ ఎం విజయలక్ష్మి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *