సర్వే శిక్షణా తరగతులు పర్యవేక్షించిన కమీషనర్ హరిత

నెల్లూరు: జగనన్న శాశ్వత భూహక్కు పధకంలో భాగంగా నిర్వహించనున్న రీ సర్వేపై సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శులకు శిక్షణా తరగతులను సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ వరకు జరిగే శిక్షణను నగర పాలక సంస్థ కమిషనర్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శులు శిక్షణా సమయంలో సబ్జెక్ట్ నేర్చుకోవాలని సూచించారు. అత్యాధునిక రీతిలో డ్రోన్ల సహకారంతో జరిగే రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. సమగ్ర రీ సర్వే ద్వారా నగరంలోని స్థలాలకు శాశ్వత ఆస్థి హక్కు కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో నగర తహశీల్దార్, సర్వేయర్లు, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.