సంగం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలించిన కమిషనర్

నెల్లూరు: నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మీద నిర్మించిన ఇండెక్ వెల్, కొండమీద నిర్మించిన 122 ఎమ్.ఎల్.డి సామర్ధ్యం గల ట్రీట్మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ సంప్, పంప్ హౌస్ తదితర నిర్మాణాలను పరిశీలించి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లియర్ వాటర్ సంప్ లో తలెత్తిన నాన్ రిటర్న్స్ వాల్వ్ రిపేరు పనులను త్వరితగతిన పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని అధికారులను కమిషనర్ సూచించారు..ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఎస్.ఈ గోపాల్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.