వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాల కుదింపు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికిగాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లు జారీ చేస్తున్న విషయం విదితమే….జనవరి 4వ తేదీ బుధవారం నుంచి 4 కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది..అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల 2వ సత్రం (గోవిందరాజస్వామి సత్రాలు) కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తారు…భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని టీటీడీ కోరింది.