ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం- రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలు

అమరావతి: జూలై 26వ తేదిన ప్రారంభమైన 5G స్పెక్ట్రమ్ వేలం సోమవారంతో ముగిసింది..ఈ వేలంలో మొత్తం రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలు అయ్యాయి..మొత్తం 40 రౌండ్లుగా వేలం ప్రక్రియ నిర్వహించారు..వేలంలో అత్యధికంగా రిలయన్స్ జియో సంస్థ రూ.84,500 కోట్ల బిడ్లు దాఖలు చేయగా,,ఎయిర్‌టెల్ సంస్థ రూ.46,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా సంస్థ రూ.18,500 కోట్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ.5,000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి..గత సంవత్సరం నిర్వహించిన 4G వేలం కంటే ఈసారి 5G స్పెక్ట్రమ్ వేలం బిడ్లు దాదాపు రెట్టింపు పలకడం గమనించ తగ్గ ఆంశం..అప్పట్లో 4 G వేలం ద్వారా రూ.77,815 కోట్ల ఆదాయం వస్తే,,ఈ సారి 1.5 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వంకు సమకూరింది..వేలంలో జియో, ఎయిర్‌టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5 G స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకోగా, అదానీ గ్రూప్ 26 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకుంది..వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని సర్కిళ్లకు మాత్రమే బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం..