విజేతలు..
నెల్లూరు: గత రెండు రోజులుగా నెల్లూరు ఏ.సిసుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న జోనల్ స్థాయి బాల్ బాడ్మింటన్ (షటిల్) జోనల్స్ పోటీలు ముగిసాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు శాప్ బోర్డు సభ్యుడు కాలువ.నరసింహులు బహుమతి ప్రధానం చేశారు..జోనల్ లెవల్స్ లో సింగిల్స్,,డబుల్స్ లో మొదటి,,రెండవ స్థానాల్లో గెలిచిన పురుష,,మహిళ జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి సీ.ఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.
జోనల్స్ స్థాయి విజేతలు:-మహిళలు సింగిల్స్: మొదటి స్థానం:డి.దీపికా, పలన్నాడు జిల్లా..రెండవ స్థానం:- సి.యస్.ఆర్.ప్రణవీ, ప్రకాశం జిల్లా..మహిళలు డబుల్స్ :-మొదటి స్థానం-సి.యస్.ఆర్.ప్రణవీ, యం.ఈషా, ప్రకాశం జిల్లా…రెండవ స్థానం-డి. స్రవంతి, డి.దీపికా, పలన్నాడు జిల్లా..
పురుషులు సింగిల్స్:-మొదటి స్థానం-పి.చంద్ర గోపినాధ్, గుంటూరు జిల్లా..రెండవ స్థానం-ఏ.కార్తికేయ,గుంటూరు జిల్లా.. పురుషులు డబుల్స్:-మొదటి స్థానం-పి.చంద్ర గోపినాధ్, కార్తికేయ గుంటూరు జిల్లా..రెండవ స్థానం- పి. అనిల్,, ఏ. సయ్యద్ బాబు, పల్నాడుజిల్లా..