EVMల గోడౌన్ల వద్ద నిరంతరం నిఘా ఉంచాలి-కలెక్టర్

నెల్లూరు: EVMల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలనికలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.తనిఖీల్లో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్ ను ఆర్డీవో మలోలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గోడౌన్ లోని ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించి రిజిస్టర్లో సంతకం చేశారు. గోడౌన్ పరిసరాల్లో భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బిజెపి, వైసిపి, టిడిపి ప్రతినిధులు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, రసూల్, తాసిల్దార్ నిర్మలానంద బాబా, సీనియర్ అసిస్టెంట్ ఆషర్ తదితరులు ఉన్నారు.