అమరావతి: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్‌ల ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా,45 పిస్టల్స్ వీరి లాగేజ్ లో బయటపడ్డాయి..వీరిని అధిఅరెస్టు చేశారు.. వీరిద్దరూ భార్యభర్తలు కాగా వీరితో పాటుగా 17 నెలల కుమార్తె కూడా ఉంది..వీరు జులై 11న వియత్నాం నుంచి ఇండియాకు తిరిగి వచ్చారని కస్టమ్స్ కమీషనర్ జుబైర్ కమిలి తెలిపారు.. రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్ గురించి విచారించగా,,ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి విమానంలో వియత్నం వచ్చిన తన సోదరుడు మంజిత్ సింగ్ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్ సింగ్ తెలిపాడు.. నిందితులిద్దరూ గతంలో టర్కీ నుంచి ఇండియాకు 25 పిస్టల్స్ ను తీసుకొచ్చినట్లు విచారణలో అంగీకరించారు.. 45 పిస్టల్స్ విలువ సుమారుగా రూ.22 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..వీరిద్దరిని కస్టమ్స్ AC Section 104 కింద అరెస్టు చేశారు..వీరి కుమారైను వారి అమ్మమ్మకు అప్పగించారు..ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు కమీషనర్ పేర్కొన్నారు.