అమరావతి: భారత్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ &బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు శుక్రవారం ప్రమాదానికి గురైంది. మెర్సిడెఎస్ బెంజ్ GL కారులో ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది..కారును స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది..ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది..ఢీకొట్టిన వెంటనే కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి..కారులో నుంచి రిషబ్ పంత్ బయటికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది..స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు..రాత్రి ప్రయాణం కావడంతో కాస్త నిద్రమత్తు వచ్చిందని,, రెప్పపాటులోని ప్రమాదం జరిగిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.