శబరిమల క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ-అయ్యప్ప భక్తులు అడవి మార్గంలో రావద్దు

అమరావతి: శబరిమల అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు,స్వామిని దర్శించుకునేందుకు ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్ల సంఖ్య లక్ష దాటింది.భక్తుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడంతో,వారిని నియంత్రించేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు.భక్తుల సంఖ్యను దృష్టిలో వుంచుకుని,అయ్యప్ప దర్శన సమయాని మరో గంట పాటు పెంచేందుకు అవకాశలు పరిశీలించాలని కేరళ హైకోర్టు ఆలయ అధికారులకు సూచించింది.శబరిమల క్షేత్రంలో నేడు దర్శనం కోసం దాదాపు లక్ష ఏడువేల మంది భక్తులు ముందస్తు బుకింగ్ చేసుకున్నట్ల అధికారులు తెలిపారు.పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులను బృందాలుగా అనుమతి ఇస్తున్నమని,,రద్దీ వున్న నేపధ్యంలో భక్తులు ఎవ్వరు అడవి మార్గంలో రావద్దని,ప్రధాన మార్గంలోనే సన్నిధానికి చేరుకోవాలని కోరారు.