బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ తొలి మహిళ సీ.ఎస్ శాంతికుమారి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు..1989 IAS బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు..పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న శాంతికుమారిని C.Sగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు..తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది..అనంతరం శాంతి కుమారి తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు..2025 ఏప్రిల్ వరకు శాంతి కుమారి సీఎస్ గా కొనసాగనున్నారు..ఏపీ క్యాడర్ కు బదిలీ అయిన తెలంగాణ మాజీ సీఎం సోమేశ్ కుమార్ శాంతి కుమారికి బాధ్యతలు అప్పగించి,రిలీవ్ అయ్యారు..దీంతో తెలంగాణకు తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి చరిత్ర సృష్టించారు..శాంతి కుమారికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు..తనపై నమ్మకం ఉంచి సీఎస్ గా నియమించినందుకు శాంతికుమారి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.