తీరం వైపు దూసుకొస్తోన్న మాండుస్ తుఫాన్

నెల్లూరు: మాండూస్ తుపాను 65 నుంచి 70 కీ.మీ వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుపాను కదలికలపై పర్యవేక్షణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రకారం జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నారు. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులు ఆప్రమత్తంమైయ్యారు. సహాయ చర్యల కోసం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు NDFR,,SDRF సహాయక బృందాలు చేరుకున్నాయి. కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా 6 జిల్లాల్లోని సుమారు కోటిమందికి తుపాను హెచ్చరికల సందేశాలను పంపించారు.