DISTRICTS

ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లింపుల్లో D.D.O.లదే పూర్తి బాధ్యత-శ్రీనివాస్

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఆయా శాఖల D.D.O.లదే పూర్తి బాధ్యత అని  విజయవాడ ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఆదాయ పన్నుకు సంబంధించి ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపు వ్యవహారాల్లో D.D.O లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను వివరాలను పరిశీలిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరిలో ఉద్యోగులకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదాయపన్ను  చెల్లింపునకు సంబంధించి పాత విధానం, కొత్త విధానం రెండూ అమలులో ఉన్నాయని, ఉద్యోగులు వారికి లాభదాయకమైన విధానంలో పన్ను చెల్లించాలని సూచించారు. D.D.O లు వారి యొక్క TAN నెంబర్ తెలుసుకుని ఉండాలని, ఇన్కమ్ టాక్స్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ తో ప్రతినెలా ఉపయోగిస్తూ, అవసరమైతే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఈమెయిల్, మొబైల్ నెంబర్ నే ఆదాయ పన్ను చెల్లింపులో నమోదు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల D.D.Oలతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును రూపొందించి, ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆదాయ పన్ను శాఖ అధికారి ఎస్ రాజశేఖర్, జిల్లా ఖజానా కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ గంగాధర్, ఏటిఓ లోకేష్ బాబు, ఎస్టిఓ రహమాన్, డిడివోలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *