దా,దా,దా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? సజ్జల,నేనుసిద్దమే-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: పార్టీలో కష్టపడి పనిచేస్తున్న తనపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందని,,అందుకే నేను పార్టీకి దూరంగా జరగాలనుకుంటున్నాను అని చెప్పడంతో, నాపై మంత్రులు,ఎమ్మేల్యేలు ముప్పేట మాటల దాడులు చేస్తున్నరని వైసీపీ రెబల్ నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటినుంచి వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేశారని,నన్ను అరెస్ట్ చేయిస్తాం అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు..ఎన్నిసార్లు, ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా నేను నిజాలు మాట్లాడుతునే ఉంటానని స్పష్టం చేశారు.