అమరావతి: భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్ కు DCGI అనుమతి మంజూరు చేసింది..ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీగా వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..ఇంట్రానాసల్ కోవిడ్19 టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పేర్కొన్నారు..ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ టీకాకు అనుమతి పొందడం ఇదే తొలిసారి..ఇప్పటికే భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా అందుబాటులో ఉండగా,కోవిడ్‌పై పోరాటంలో భారత్ ముందంజలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది..గత వారం, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ,, భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ని సిఫార్సు చేసింనట్లుగా సమాచారం..ఇంత వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని,,ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు..
నాసికా వ్యాక్సిన్:COVID-19 సంక్రమణ,,ప్రసారం రెండింటినీ నిరోధించే అవకాశం ఉంది..నాన్-ఇన్వాసివ్,,సూది-రహితగా ఇది ఉంటుంది..శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు అవసరం లేదు కాబట్టి వ్యాక్సిన్ చేయడం చాలా సులభం..సూది-సంబంధిత ప్రమాదాలను తొలగిస్తుంది (గాయాలు, అంటువ్యాధులు)..పిల్లలు, పెద్దలకు అందరికి సరిపోతుంది..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను ఇవి తీర్చగలదు..
Big Boost to India's Fight Against COVID-19!
Bharat Biotech's ChAd36-SARS-CoV-S COVID-19 (Chimpanzee Adenovirus Vectored) recombinant nasal vaccine approved by @CDSCO_INDIA_INF for primary immunization against COVID-19 in 18+ age group for restricted use in emergency situation.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 6, 2022