శివయ్య సన్నిధిలో కార్తీకమాసం తొలి సోమవారం దీపారాధన

శ్రీకాళహస్తీ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం పక్కన కార్తీకదీపాలు వెలిగించేందుకు భక్తుల కోసం ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటుచేసారు.ఈ ప్రాంగణంలో శ్రీ వాయు లింగేశ్వర స్వామి నమూనా విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె.వి.సాగర్ బాబు,పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.