నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులైన జవాన్లకు నివాళి అర్పించిన రక్షణశాఖ మంత్రి

అమరావతి: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు..1999లో పాకిస్థాన్ తో జరిగిన కార్గిల్ వార్‌లో అమరులైన జవాన్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళి అర్పించారు..ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి వీర జవాన్లకు అంజటి ఘటించారు.. విజయ్ దినోత్సవ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు..23 సంవత్సరాల క్రిందట L.O.C. వద్ద పాకిస్థాన్ సైన్యం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని, భారత సైన్యం ఇదే రోజున తిరిగి స్వాధీనం చేసుకుంది..ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జులై 26వ తేదిన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తారు.