ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4వ తేదిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7వ తేదిన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7వ తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్స్ గడువు 14వ తేది ముగుస్తుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో నేటి నుంచే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నదని,మొత్తం 250 వార్డుల్లో 1.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హాక్కు వినియోగించుకోనున్నారని,,MCDలో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలని కమిషనర్ విజయ్ దేవ్ పేర్కొన్నారు.