బెంగళూరులో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలైంది-మంత్రి అశోక్

అమరావతి: బెంగళూరులో అక్రమంగా నిర్మించిన భవనాలను,,నొయిడాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేసినట్లుగానే బెంగుళూరులో కూడా తొలగిస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ హెచ్చరించారు..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు నగరం పూర్తిగా మునిగిపోయి,,ఐ.టీ ఉద్యొగులు ట్రాక్టర్లపై ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చింది..ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ మంగళవారం చర్యలకు ఉపక్రమించింది.. నగరంలో వరద నీరు వెళ్లకుండా నిర్మించిన అక్రమాల కూల్చివేత ప్రక్రియను చేపట్టింది..మహదేవెపుర జోన్ పరిధిలోని శాంతినికేతన లేఔట్ తో పాటు పలు ప్రాంతాల్లోని అక్రమాల తొలగింపును చేపట్టింది..”సరైన పత్రాలు లేకపోతే ఎంతటి వారినైనా వదిలిపెట్టొదని డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది,,చిన్నా పెద్దా తేడా లేకుండా తొలగించాలని చెప్పాం,, చాలా ఐటీ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయి,,సుమారు 30 సంస్థల జాబితాను తయారు చేసి తొలగించాలని ఆదేశాలిచ్చామని మంత్రి పేర్కొన్నారు..రాబోయే వర్షాకాలం నాటికి సీటీలో అక్రమ నిర్మాణాలు లేకుండా చేస్తామని మంత్రి చెప్పారు..వర్షం ఆగిపోగానే,, అక్రమాలను తొలగించకుండా గత ప్రభుత్వాలు నాటకాలు ఆడాయన్నారు..అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దని ప్రభుత్వం ఆదేశించిందని బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ అధికారులు తెలిపారు..ధనవంతుల చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చకుండా పేద వారి ఇళ్లను కూల్చివేస్తున్నారని కొంత మంది బాధితులు ఆరోపిస్తున్నారు..సరైన శాస్త్రీయ సర్వే,,ముందుస్తు నోటీసులు లేకుండానే నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆక్రమన నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు..