DEO ప్రైవేట్ పాఠశాలలకు అమ్ముడుపోయారు-ఏబీవీపీ

DEO రాజీనామా చేయాలి
నెల్లూరు: ప్రైవేట్ కార్పొరేటర్ పాఠశాలలకు నెల్లూరు DEO అమ్ముడు పోయారని, నగరంలో పలు ప్రైవేట్ పాఠశాలల్లో దసరా సెలవులు ఇవ్వకుండా చిన్నపిల్లలకు గాని తరగతులు నిర్వహిస్తున్నారని DEOకి తెలియచేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ నగర కార్యదర్శి యశ్వంత్ ఆరోపించారు.శుక్రవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతున్న DEOని సస్పెండ్ చేయాలంటూ VRC సెంటర్ లో ఆందోళన చేశారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని,,DEO ప్రైవేట్ పాఠశాలలకు అమ్ముడుపోయి తరగతులు నిర్వహణకు సహకరిస్తున్నారని విమర్శించారు.పండుగ సమయంలో విద్యను వ్యాపారం చేస్తూ సెలవులు ప్రకటించకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో DEO కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సాయి, మని, కార్తీక్, రాఘవేంద్ర, అభిలాష్, చందు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.