x
Close
NATIONAL

సరిహద్దుల వద్ద గరుడ కమాండోలను మోహరించిన భారత్

సరిహద్దుల వద్ద గరుడ కమాండోలను మోహరించిన భారత్
  • PublishedDecember 22, 2022

అమరావతి: నక్కజిత్తుల డ్రాగన్ దేశంకు తగిన బుద్ది చెప్పెందుకు,,చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA) తో ప్రతిష్టంభన నేపధ్యంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) కు దగ్గరగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కు చెందిన గరుడ కమాండోలను భారత వైమానిక దళం మోహరించింది..తూర్పు లడఖ్‌లోని LAC సమీపంలో అపాచీ దాడి హెలికాప్టర్లు, చినూక్ హెవీ-లిఫ్ట్ ఛాపర్లను IAF మోహరించింది. గరుడ్ ప్రత్యేక దళాల విభాగం MI-17 హెలికాప్టర్ల నుంచి కసరత్తులు చేపట్టింది..12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా LACలో ఘర్షణ పాయింట్లలో ఒకటైన గోగ్రా వద్ద భారత్-చైనా దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గత వారం నిర్ణయించాయి..ఈ సంవత్సరం ప్రారంభంలో, తూర్పు లడఖ్‌లోని పాంగ్యాంగ్ త్సో సరస్సు నుంచి కూడా ఇరుపక్షాలు తమ దళాలను ఉపసంహరించుకున్నాయి.. గరుడ కమాండోలకు అమెరికన్ సిగ్ సాయర్ అసాల్ట్ రైఫిల్ వంటి ఆయుధాలను భారత వైమానిక దళం సమకూర్చింది. వీటితోపాటు గలీల్ స్నిపర్ రైఫిల్స్, ఇజ్రాయెలీ ట్వెర్ రైఫిల్స్, 800-1000 మీటర్ల పరిధిలో శత్రు సైనికులను పడగొట్టగల నెగెవ్ లైట్ మెషిన్ గన్స్,,AK-103 లను గరుడ కమాండోలకు అందించారు.. గరుడ కమాండోలు వింగ్ జమ్ముకశ్మీర్‌లో బ్లడ్‌ హజిన్‌ ఆపరేషన్‌ లో LMGని ఉపయోగించి,,ఐదుగురు ఉగ్రవాదులను గరుడ బృందం హతమార్చింది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.