హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే IAS అధికారిణి స్మితాసబర్వాల్.తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నారు..ఈమె ట్విట్టర్ వేదికగా అభివృద్దికి సంబంధించి పలు ట్వీట్లు చేస్తూ ఉంటారు..మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరికి చెందిన డిప్యూటీ తాసిల్దారు ఆనంద్ కుమార్ రెడ్డి,,శుక్రవారం రాత్రి దాదాపు 11.30 నిమిషాల సమయంలో తన స్నేహితుడు బాబుతో కలిసి కారులో జూబ్లీహిల్స్ లోని స్మితాసబర్వాల్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు..ఈ సమయంలో ఎవరూ అయ్యుంటారు అంటూ తలుపు తెరిచిన IAS అధికారిణికి,,ఎదురుగా తనకు ముఖ పరిచయం లేని వ్యక్తి కనిపించడంతో ఎవరు నువ్వు అంటూ గట్టిగా నిలదీసింది..దీంతో ఆనంద్ తాను మేడ్చల్ జిల్లా డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని,,మీరు సోషల్ మీడియా చేసే ట్వీట్లను, రీ ట్వీట్ చేస్తు వుంటాను,,నా ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చాను అంటూ సమాధానం ఇచ్చాడు..దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్మితాసబర్వాల్,,సెక్యూరిటీని కేకలు వేయటంతో,, వాళ్ళు వచ్చి ఆనంద్ కుమార్ రెడ్డిని అతని స్నేహితుడిని నిర్భంధించి,,పోలీసులకు సమాచారం అందించారు..వెంటనే సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులకు స్మితాసబర్వాల్ ఫిర్యాదు చేశారు..ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు,,ఆనంద్,అతని స్నేహితుడు బాబులను అరెస్ట్ చేసి,,వారు వచ్చిన కారును సీజ్ చేశారు..కోర్టులో హాజరు పర్చగా,వారికి కోర్టు రిమాండ్ విధించింది..