అభివృద్ధి అనేది పెద్ద నగరాల్లో కేంద్రీకృతం కాకుడదు-ప్రధాని మోదీ

2-టైర్,, 3-టైర్ నగరాలపై..
అమరావతి: అభివృద్ధి అనేది పెద్ద నగరాల్లో కేంద్రీకృతం కావడంతో అదే స్థాయిలో సమస్యలు పెరిగుతున్నాయని,,దింతో సదరు నగరాలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని,,2-టైర్,, 3-టైర్ నగరాలపై శ్రద్ధ తీసుకుని,వాటిని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు..మంగళవారం భారతీయ జనతా పార్టీ చెందిన వివిధ రాష్ట్రలకు చెందిన మేయర్లతో నిర్వహించిన సమావేశానికి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు..బీజేపీ పాలనలో ఉన్న వివిధ నగరాలకు చెందిన 118 మంది మేయర్లు,,డిప్యూటీ మేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు..ఎన్నికలను దృష్టిలో వుంచుకుని రాజకీయాలు నడిపితే, నగరాలు ముందడుగు వేయలేవని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని బీజేపీ మేయర్లకు మోదీ సూచించారు.. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆలోచించకూడదన్నారు..ఎన్నికల కేంద్రీకృత విధానంతో మీరు మీ నగరాన్ని అభివృద్ధి చేయలేరు..నగరాలకు ఆదాయ వనరులు సమకుర్చే నిర్ణయాలు చాలాసార్లు ఎన్నికల్లో ఓటమికి దారి తీస్తాయి అన్న భయంతో నాయకులు తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..అలాగే కేంద్ర నిధులపై ఆధారపడకుండా నగర అభివృద్ది ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు..గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను మోదీ గుర్తు చేసుకుంటూ,, బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ,, యాప్ ఆధారిత ఆటో- రిక్షా సేవలు,, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టు వంటి అత్యాధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అవలంభించడంలో ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందు అడుగు వేసిందన్నారు..ప్రస్తుతం దేశంలో మెట్రో రవాణ వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని,ఇందుకు నిదర్శనం… 2014కి ముందు దేశంలో 250 కి.మీ.కంటే తక్కువ దూరం మెట్రో ఉందని,, నేడు అది 750 కి.మీ. దూరాన్ని దాటి మరో 1,000 కి.మీ నిర్మాణాన్ని చేపట్టనున్నదని తెలిపారు..నగరాల్లో గృహ నిర్మాణం చాలా ముఖ్యమైందని,, దీనికి కోసం తమ ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రధాని వెల్లడించారు.ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 1.25 కోట్ల ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.. అలాగే దేశంలో అమృత్ పథకం క్రింద 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి కొనసాగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.