బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేపై అభివృద్ది పరుగులు తీస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: అభివృద్ధి అనేది పట్టలకే పరిమితం కాకుండా గ్రామాలకు కూడా విస్తరిస్తారించినప్పుడే అభివృద్ది ఫలాలు అందరికి అందుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేను,,ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు..రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవే ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది.నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేను 6 లైన్లకు విస్తరించారు..ఈ రహదారి పైన చిత్రకూట్ నుంచి దిల్లీకి 6 గంటల్లోనే చేరుకోవచ్చు..ఈ సందర్బంలో ప్రధాని ప్రసంగిస్తూ అన్ని ప్రాంతాలను అనుసంధానంతో, పారిశ్రామిక అభివృద్ధికి సాధ్యం అవుతుందని, ఇందుకు ఎక్స్ ప్రెస్ హైవేలు దోహదపడుతాయన్నారు..శాంతిభద్రతలు,,మౌలిక సదుపాయాలు వుంటేనే వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయన్నారు..రాష్ట్రంలో టూరిజం మరింత అభివృద్ధి కానుందన్నారు.. అనుకున్న టైమ్ కంటే ముందుగానే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేను ప్రారంభించామని,,ప్రస్తుతం దేశం మొత్తం యూపీవైపు చూస్తోందన్నారు..