గరుడ సేవకు వేళ్ళు భక్తులు వెహికాల్స్ పాసులు తీసుకొని వెళ్ళాలి-తిరుపతి ఎస్పీ

పాస్ లు పూర్తిగా ఉచితం..
తిరుపతి: 1వ తేదీ శనివారం శ్రీవారి గరుడ సేవ రోజున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, దీనికి స్థానిక ప్రజలు, భక్తులు,వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి IPS విజ్ఞప్తి చేశారు. పాసులు పూర్తిగా ఉచితముగా ఇవ్వబడును ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదని,,తిరుమల గరుడసేవలకు వచ్చే భక్తులు తమ యొక్క వాహన కార్ పాసులను ఏర్పాటుచేసిన సెంట్రల్ వద్ద ఈ క్రింది ప్రాంతాలలో పొందగలరన్నారు.
1-కడప జిల్లా వైపు నుంచి వచ్చే భక్తులు కుక్కల దొడ్డి వద్ద గల కేశవరెడ్డి హై స్కూల్, కరకంబాడి రోడ్డు నందు గల అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పాసులు పొందగలరు.
2- నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఏర్పేడు వద్ద గల శ్రీ ఇంజనీరింగ్ కాలేజీ నందు పాసులు ఇవ్వడం జరుగుతుంది.
3-చెన్నై వైపు నుంచి వచ్చు వాహనాలు ఆగస్త్య ఎన్ క్లేవ్ నియర్ టోల్ ప్లాజా (వడమలపేట) వద్ద పాసులు ఇవ్వడం జరుగుతుంది.
4-చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనములకు ఐతే పల్లి దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్స్ నందు పాసులు ఇవ్వబడును.
5-మదనపల్లి నుంచి వచ్చు వాహనములకు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పాసులు ఇవ్వడం జరుగుతుంది.
6-తిరుపతి టౌన్ లో ఉన్నటువంటి భక్తులకు నాలుగు ప్రాంతాల్లో పాసులు ఇవ్వడం జరుగుతుందని అవి,,1-భారతీయ విద్యా భవన్…2-జూ పార్కు దగ్గర ఉన్నటువంటి దేవ లోక్…3-ఎస్.వి ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాడి రోడ్డు…4-శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాడి రోడ్డు నందు పాసులు ఇవ్వడం జరుగుతుంది.
ద్విచక్ర వాహనాలు నిషేధం:- శ్రీవారి గరుడ సేవకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా,, సురక్షితమైన ప్రయాణం కోసం తిరుమలకు ద్విచక్ర వాహనాలను కూడా నిషేధించడం జరిగింది..ద్విచక్ర వాహనాలను 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2వ తేదీ ఉదయం వరకు నిషేధం ఉంటుందని ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు వారికి సహకరించాలన్నారు.
టూరిస్ట్ బస్సుల వాహనాల పార్కింగ్ లు ఈ క్రింది విధంగా:-
1)-”దేవలోక్ పార్కింగ్ :- టూరిస్ట్ బుస్సులకు టిటిడి వారు నిర్ణయించిన పరిమితికి మించి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన వాహనాలు టెంపో ట్రావెలర్, మెట్టడోర్ మొదలైనవి చెర్లోపల్లి నుంచి జూ పార్క్ కి సమీపం లో ఉన్న“దేవలోక్” పార్కింగ్ స్థలము…
2)-భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్:- కార్లు, జీపులు మొదలైన చిన్నవాహనాలు సైన్స్ సెంటర్ కు ఏదురుగా ఉన్న భారతీయ విద్యా భవన్ స్కూల్ గ్రౌండ్ స్థలము.
3)-ద్విచక్ర వాహనాలు కొరకు:-1-అలిపిరి గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్ పాయింట్…2- ISKON గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్…3-మెడికల్ కాలేజీ గ్రౌండ్…4-మెటర్నటి హాస్పిటల్ కి ఏదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్. ప్రజలు భక్తులు పై విషయాన్ని గమనించి ద్విచక్ర వాహనాల ను పార్కింగ్ చేయవలసినదిగా పోలీసలు విజ్ఞప్తి చేశారు.