Close

అమరావతికి మద్దతుగా సింహపురి వాణి రాష్ట్రమంతా వినిపించేలా సభ-సోమిరెడ్డి

అమరావతికి మద్దతుగా సింహపురి వాణి రాష్ట్రమంతా వినిపించేలా సభ-సోమిరెడ్డి
  • PublishedNovember 10, 2022

నెల్లూరు: రాజధానిగా అమరావతి ఎంపిక ఏకగ్రీవ నిర్ణయం..అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో రాజధాని అమరావతికి మద్దతుఃగా నెల్లూరులో ఈ నెల 14వ తేదిన ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలియచేస్తు,ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ అమరావతికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనకు విచ్చేశారు.ఈ రోజు కథలు చెబుతున్న జగన్ రెడ్డి ఆరోజే అమరావతిపై అభ్యంతరం తెలిపివుంటే రైతులు పొలాలిచ్చేవారు కాదన్నారు. జబర్దస్త్ రోజా విమానంలో విశాఖ వెళ్లి గర్జించివచ్చింది.. నగిరి ప్రజలకు అమరావతి దగ్గరా, విశాఖ దగ్గరా అంటూ ప్రశ్నించారు.భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు అమరావతికి జైకొట్టి ఓట్లు వేయించుకున్నాడు..ఇప్పుడేమో విశాఖ అంటూ ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.ఓ వైపు చలివేంద్రం భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు..మరోవైపు రైతును దగా చేస్తున్నారు…ఇన్ని జరుగుతుంటే ఈ జిల్లాలో ఉండే మంత్రి ఏం చేస్తున్నాడో? సర్వేపల్లిలో మంత్రి కాకాణి వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినా ఆయనకీ ఆశ తగ్గక దోపిడీని కొనసాగిస్తున్నారు..జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వాతావరణం అనుకూలిస్తే నవంబర్ 14న నెల్లూరులో జిల్లా స్థాయిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించబోతున్నాం..వీఆర్సీ సెంటర్ నుంచి బయలుదేరి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ…అనంతరం అక్కడే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ పెట్టాలని నిర్ణయించామని,ఒక వేళ వర్షాలు మొదలైతే తగ్గిన తెల్లారే పెట్టేలా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.14వ తేదీన జరగబోవు ర్యాలీలో ఏ పార్టీ అయినా పాల్గొనవచ్చని సామాన్య ప్రజలు కూడా పాల్గొనవచ్చని ఎవరు పాల్గొన్న స్వాగతిస్తామని తెలిపారు… కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనురాధ, రమణయ్య, జాఫర్ షరీఫ్, శైలేంద్ర బాబు, రామ్మూర్తి, రాజా నాయుడు, సాబీర్ ఖాన్, సత్యనాగేశ్వర రావు, భువనేశ్వరి ప్రసాద్, జహీర్, కువ్వరపు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published.