Close

సమస్యలపై ప్రశ్నిస్తే,వైసీపీ నాయకులు బూతులు లంకించుకుంటారు-పవన్

సమస్యలపై ప్రశ్నిస్తే,వైసీపీ నాయకులు బూతులు లంకించుకుంటారు-పవన్
  • PublishedJuly 17, 2022

జనవాణి-జనసేన భరోసా..

అమరావతి: రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడిపోతున్నరని,,ముద్దుల మామయ్య జగన్కి నోటి నుంచి మాటలు వస్తాయి తప్ప జేబులో నుండి డబ్బులు రావని,,5 సంవత్సరాల కాలంలో అద్భుతాలు కాకపోయినా కనీసం పనిచేయాలి కదా,,ఇదేమిటని అడిగితే నాయకులు బూతులు తిడుతూ కూర్చుంటారని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.. అదివారం 3వ విడత “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమం, భీమవరంలో నిర్వహించారు..బాధితుల నుంచి వినతులు తీసుకున్న అనంతరం ప‌వన్ క‌ల్యాణ్ మాట్లాడుతూ… మ‌ద్య‌పాన నిషేధం విధిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే నేరుగా మ‌ద్యం అమ్ముతోంద‌ని మండిప‌డ్డారు..మ‌ద్యం ద్వారానే ప్ర‌భుత్వానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని,, ప్ర‌భుత్వం మ‌ద్యం ఆదాయాన్ని చూపుతూ రుణాలు తీసుకుంటోంద‌ని తీవ్రంగా విమర్శించారు..ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,,అన్నొస్తున్నాడు గంజాయి సాగు చేసి అందరికి గంజాయి ఇస్తామని చెప్పండి అన్నట్లుగా పాలను ఉందంటూ ఎద్దేవా చేశారు..ఏపీలో ఇప్ప‌టికీ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు ఉన్నాయని, కనీస మరమ్మతులు కూడా జిల్లాలో జరగలేదన్నారు..గతంలో ఇసుకపై ప్రభుత్వంకు 4 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని,,ప్రస్తుతం ఇసుకపై దాదాపు 36 వేల కోట్ల రూపాయ‌లు వస్తుందని,,మరి అలాంటప్పుడు రోడ్లకు మరమ్మత్తులు చేసే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published.