గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా-హైకోర్టు

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
అమరావతి: విశాఖపట్నంలోని రిషికొండపై అక్రమ తవ్వకాలపై జరుగుతున్నఅంటూ దాఖలైన పిటీషన్ పై తవ్వకాల వివరాలపై కమిటీ వేస్తే అభ్యంతరం ఎందుకంటూ,రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట జనరల్ నిరంజన్ రెడ్డిని,, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. గురువారం హైకోర్టులో రిషికొండ అక్రమ తవ్వకాలు విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది పేరిట కొండలను త్రవ్వేస్తున్నరని,,ఇదే సమయంలో రాజధాని అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఇతర ప్రాంతానికి రానివ్వమంటున్నారని,, ప్రభుత్వంలో విభిన్న వైఖరిలు ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుంది అంటూ న్యాయమూర్తి ఘటుగా వ్యాఖ్యనించారు..కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయమని పంపుతామని హైకోర్టు పేర్కొంది. 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే,, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు కే.ఎస్ మూర్తి, అశ్వినీ కుమార్ లు హైకోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు అందజేశారు. తాము 9.88 ఎకరాలకే పరిమితమయ్యామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకు వివరించే ప్రయత్నం చేయగా,, న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా అంటూ ప్రశ్నించారు. తాము ఆఫిడవిట్ దాఖలు చేస్తానమని,,అంత వరకూ సమయం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది,న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. మీరు అఫిడవిట్ వేసిన తరువాత నిజా, నిజాలు తేలుస్తామని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశిస్తూ ధర్మాసనం పేర్కొన్నంటూ, కేసు విచారణను నవంబర్ 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు.