NATIONAL

నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింస సంఘటను నేరుగా ప్రసారం చేయకండి-కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ

అమరావతి: వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది..వీక్షకులకు భయం కలిగించే వీడియోలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలు,,మృతదేహాలను యథాతధంగా చూపించకుండా,,బాధ్యతాయుతమైన వార్తలు,స్టోరీలను ప్రసారం చేయాలని సూచించింది..నేరాలు,ప్రమాదాలు,హింసకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్తలు తీసుకుని,, ప్రోగామ్ కోడ్‌కు అనుగుణంగా ఫుటేజ్‌లను ప్రసారం చేయాలని ఆదేశించింది..ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఫోటోలను వీడియో క్లిపింగ్ లను టీవీ చానల్స్ ప్రసారం చేశాయి..”కొన్ని ఛానళ్లు మృతదేహాలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను దగ్గర నుంచి చూపిస్తున్నాయి..టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడుల వీడియోలను బ్లర్రింగ్ చేయకుండానే మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నాయి..ఇలా రిపోర్ట్ చేయడం బాధాకరమే కాకుండా,, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంది..వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తాయని,, చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపింది..బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతుందని,,అలాగే ఇళ్లలో అన్ని వయసుల వారు కలిసి కూర్చుని టీవీ ప్రోగ్రామ్‌లు చూస్తుంటారని పేర్కొంది..ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రసారాలు చేయాలి” అని మంత్రిత్వ శాఖ ఈ అడ్వయిజరీలో పేర్కొంది.. చాలాకేసుల్లో సోషల్ మీడియోలో నుంచి వీడియోలను తీసుకుని, ఎలాంటి సమీక్ష లేకుండా, సవరణలు చేయకుండా, ప్రోగ్రామ్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రసారం సాగిస్తున్నారని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *