రాత్రి 10 గంటలు దాటితే పబ్స్ లో ఎలాంటి సౌండ్ పెట్టొద్దు-హైకోర్టు

హైదరాబద్: జంటనగరల్లోని పబ్స్ పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. రాత్రి 10 గంటలు దాటితే పబ్స్ లో ఎలాంటి సౌండ్ పెట్టొద్దని అదేశించింది..రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సౌండ్ పెట్టరాదని స్పష్టం చేసింది.. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఇవ్వాలని సూచించింది..రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్‌కు పర్మిషన్ లేదని, పబ్‌లో రాత్రి పూట కేవలం లిక్కర్ సరఫరా మాత్రమే అనుమతులు వున్నయని పేర్కొంది..నివాస గృహాలు,, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తూ,,ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులిచ్చారో ఎక్సైజ్‌శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది..హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది..