x
Close
NATIONAL

ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదు-ప్రధాని మోదీ

ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదు-ప్రధాని మోదీ
  • PublishedJanuary 19, 2023

అభివృద్ది,మౌలిక వసతులు కల్పన బీజెపీ లక్ష్యం..

అమరావతి: ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం బీజేపీ విధానం కాదు,,అభివృద్ది,మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా బీజెపీ ఏజెండా’ అని కర్ణాటక పర్యటనలో వున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం మద్ధతునిస్తుందని చెప్పారు..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గురువారం కర్ణాటకలోని యాదగిరి,, కలబురగి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు..యాదగిరిలోని కోడెగాలో జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు,,సాగునీరు,, తాగునీటికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు..అలాగే జల్ జీవన్ మిషన్ కింద బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకంతో పాటు యాదగిరిలో నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ పొడిగింపు,, పునరుద్ధరణ,, ఆధునీకరణ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు..కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా యాదగిరి జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు..ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు సమీప ప్రాంతాలలో ఉన్న బంజారా వర్గీయులు,, ముఖ్యంగా మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు..

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.