విశ్వవిద్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు-పవన్ కళ్యాణ్

అమరావతి: విశ్వవిద్యాలయాలు విద్యార్దులను సామాజిక,రాజకీయ,ప్రాపంచీక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి,అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో వున్నయనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వవిద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చి వేసి,ఆ పార్టీ ముఖ్యమంత్రి ప్లెక్సీలతో ప్రాంగణాలు నింపివేసని తీరు విద్యార్ది లోకానికి,సమాజానికి ఏం సూచిస్తొందని ప్రశ్నించారు.తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు అమోదయోగ్యమైనవి అన్నారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తొందన్నారు. విశ్వవిద్యాలయాల ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ,ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని,బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.విద్యార్దల సర్వతోముఖాభివృద్దికి కృషి చేయాలి.విశ్వవిద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వవిద్యాలయ అభివృద్దికి వైస్ చాన్సలర్స్ బాధ్యతగా పనిచేయాలని కోరారు.