భారతదేశం 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము

అమరావతి: దేశ చరిత్రలో నూతన అధ్యాయం అరంభమైంది..సోమవారం ఉదయం పార్లమెంటు సెంట్రలో హాలులో జరిగిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ,నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రెండో మహిళా రాష్ట్రపతిగా,,తొలి గిరిజన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు..
15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.,అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.అజద్ కా అమృత్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు. నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావటం ఆదివాసీల విజయం అన్నారు. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేనే అంటూ రాష్ట్రపతి హోదాలో ఉన్న ఆమె గుర్తు చేసుకున్నారు. మా గ్రామంలో బాలికలు స్కూల్ కు వెళ్లటం ఎంతో పెద్ద విషయం అని తెలిపారు.
దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు. దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పేదలు కూడా తమ కలల్ని నిజం చేసుకోవచ్చు అని తనతో రుజువైందన్నారు. మీ నమ్మకం, మద్దతు బాధ్యతల్ని నిర్వర్తించేందుకు తనకు శక్తినిస్తుందన్నారు. భారత్ స్వాతంత్య్రం సాధించిన తరువాత జన్మించిన తొలి రాష్ట్రపతిని తానే అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆశయాలకు తగినట్లు అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు. ఇంతకాలం అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడినవాళ్లు, గిరిజనులు, తనను ఆశాకిరణంగా భావించవచ్చన్నారు. తన నామినేషన్ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని,,కోట్లాది మహిళల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు..జులై 26న కార్గిల్ దివస్ ను జరుపుకుంటున్నామని,,కార్గిల్ విజయ్ దివస్ భారత్ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు..విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు..
రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.