రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము ఘన విజయం

నెల్లూరు: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము(64),, ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము భారీ ఆధిక్యం సాధించారు..గురువారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగగా,,ఊహించిన అధిక్యం కంటే అధిక మెజార్టీ లభించింది.. ద్రౌపదీ ముర్ము ఈనెల 25వ తేదిన భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. రాష్ట్రపతి పీఠం అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు..తొలి రౌండ్లో మొత్తం 748 మంది ఎంపీల ఓట్లను లెక్కించిగా,, ద్రౌపది 3,78,000 విలువైన 540 ఓట్లు దక్కించుకున్నారు.. యశ్వంత్‌సిన్హాకు 1,45,600 ఓట్లు వచ్చాయి..5 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి..రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు,1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పోల్ అయ్యాయి..ఇప్పటి వరకు పోల్ అయిన ఓట్ల విలువ ప్రకారం తీసుకుంటే,మొత్తం ఓట్లలో 72.19 శాతం అంటే దాదాపు 5,23,600 విలువగా వున్నాయి..